- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎవరితోనూ పొత్తు ఉండదన్నారు. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇందుకు బీజేపీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు.
ఇందులో వివిధ జిల్లాలకు చెందిన ఇంచార్జ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించామని.. ఇదే జోష్ కొనసాగిస్తూ లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదరబోతున్నదన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవం అన్నారు. డిసెంబర్ చివరి వారంలో జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.