అదానీ చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేం.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
అదానీ చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేం.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) ఉద్యమ సమయంలో యాదవరెడ్డి(Yadava Reddy) కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌(Parliament)లో ఆమోదించడంలో జైపాల్ రెడ్డి(Jaipal Reddy)తో పాటు యాదవ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి(Ravindra Bharati)లో యాదవరెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరుతున్నట్లు కీలక ప్రకటన చేశారు.

అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt)పై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా(China) ఆక్రమించిందని.. దీనిపై మాట్లాడటానికి ఎవరికీ దైర్యం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ(Modi) అధికారంలోకి వచ్చాక భారత భూభాగాన్ని కోల్పోయామని అన్నారు. మణిపూర్‌(Manipur)లో అంతర్యుద్ధం జరుగుతోందని.. రెండు దళిత జాతులు ఉచకోతలు కోసుకుంటున్నాయని తెలిపారు.

ఈ అంశంపై భారత బలగాలు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని ప్రశ్నించారు. ఈ రెండు అంశాలపై పార్లమెంటులో లోతైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. సోషలిస్టు విదానంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని యాదవరెడ్డి నమ్మారని అన్నారు. పదవులకు అనుగుణంగా వారు ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదని.. తెలంగాణ ఏర్పాటుపై యాదవరెడ్డితో సోనియా చర్చించారని అన్నారు. అంతేకాదు.. మోడీ ప్రధాని అయ్యాక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు పెరిగాయని ఆరోపించారు. ప్రైవేటు సంస్థల పెట్టుబడులపై విస్తృతంగా చర్చ జరగాలని పిలుపునిచ్చారు. అదానీ పెట్టుబడుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేమని.. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగల్‌ స్ట్రోక్‌తో రద్దు చేసే పరిస్థితి ఉండదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed