- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TG Assembly: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ చేయడం స్వాగతిస్తున్నా అని అన్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే మూడో విడత కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో పాడి సేకరణ సరైన పద్ధతిలో జరుగడం లేదని అన్నారు. మరోవైపు.. ఇటీవల అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యేలందరూ హాజరవటం లేదు. జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ రావడం లేదని.. కొందరు ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలు.. జీతం తీసుకోవద్దని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గన్‌మెన్లు, ప్రొటోకాల్, జీతం కోసమే కాదని.. ప్రజల గురించి కూడా ఆలోచించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకపోవటం సరికాదని.. ప్రభుత్వం ఉద్యోగులకు కట్ చేసినట్టుగానే.. ఎన్ని రోజులు సమావేశాలకు రాకపోతే అన్ని రోజుల జీతం కట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్ల చక్కర్లు కొడుతున్నాయి.