- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బతుకమ్మ చీరల పంపిణీలో స్కామ్.. సూరత్ చీరలు తెచ్చి కమీషన్లు నొక్కారు: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన బతుకమ్మ చీరల పంపిణీలో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తక్కువ ధరకు సూరత్ నుంచి చీరలు తీసుకొచ్చి పంపిణీ చేశారని.. పైకి మాత్రం నేత కార్మికులకు పనులు కల్పించామని అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బినామీలకు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇచ్చిందన్నారు. నేత కార్మికులకు రూ.275 కోట్ల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చాకే బకాయిలు చెల్లించామని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సభను తప్పుదోవ పట్టించడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
10 నెలలు నిండని ప్రభుత్వంపై 10 ఏండ్లు పాలించిన వారు ఆరోపణలు చేయడం సరికాదని చురకలంటించారు. ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు కేంద్ర ప్రభుత్వం వేస్తామంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదని దీని వెనక ఉన్న ఆర్థిక కుట్ర ఏంటో అందరికీ తెలియాలని కీలక వ్యాఖ్యలు చేశారు. మేమెప్పుడు మీ లాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చెస్తామని చెప్పలేదు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలాగా మార్చుతామనలేదని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మేం స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నాం. టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నామని అన్నారు. ప్రపంచ స్థాయి వైద్యం హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.