TS: పెట్రోల్, డీజిల్ కొరతపై కీలక ప్రకటన

by GSrikanth |
TS: పెట్రోల్, డీజిల్ కొరతపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వాహనదారులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నాకు దిగడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. కొన్ని బంకుల్లో అయితే కిలోమీటర్ల మేర క్యూ ఏర్పడింది. దీంతో పరిస్థితి అదుపుతప్పకముందే ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు చేపట్టిన ధర్నాను విరమించారు. తాజాగా.. పెట్రోల్ కొరతపై ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి ఏమాత్రం కంగారు అవసరం లేదని ఉపశమనం కలిగించే విషయం చెప్పారు. కేంద్ర చట్ట సవరణతో కొంత గందరగోళం ఏర్పడిందని, ఆయిల్ ట్యాంకర్లు యథావిధిగా నడుస్తాయని వెల్లడించారు.

Advertisement

Next Story