- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేశవాపురం రిజర్వాయర్(Kesavapuram Reservoir) కాంట్రాక్ట్ రద్దు చేస్తూ.. బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ రిజర్వాయర్.. గోదావరి నది ఫేజ్-2లో భాగంగా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో కేశవాపురం రిజర్వాయర్‌ను నిర్మించాలని చూసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రిజర్వాయర్(Reservoir ) పనులు ప్రారంభం కాలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభమై.. పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మెఘా ఇంజనీరింగ్ కంపెనీ(Megha Engineering Company)కి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగం(Department of Municipal Administration, Urban Development Engineering) బుధవారం జీవో(GO) జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవాపురం రిజర్వాయర్((Kesavapuram Reservoir) ).. అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానున్నట్లు తెలుస్తోంది.