- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రేవంత్ రెడ్డి సర్కార్‌కు బిగ్ షాక్ ఇచ్చిన కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అందరిని ఈ వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం ఇన్విటేషన్ పంపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తోన్న దశాబ్ధి ఉత్సవాలకు హాజరు కావడంపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీలతో కూడిన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ హాజరు కావడం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమానించిందని.. సీఎం రేవంత్ ప్రభుత్వ వికృత పోకడలను నిరసిస్తూ ఈ వేడుకల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని తనకు ఆహ్వానం పంపిందని.. అందుకే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.