- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా బిడ్డను అన్యాయంగా జైల్లో పెట్టారు.. భువనగిరి సభలో KCR భావోద్వేగం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ తరపున కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ హయాంలో ఏ వర్గానికి కూడా న్యాయం జరుగలేదని అన్నారు. దేశంలో దాదాపు 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఖాళీలను మోడీ ప్రభుత్వం భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయని కీలక ఆరోపణలు చేశారు. పరోక్షంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన బీజేపీకి ఓటు వేయొద్దని ఓటర్లకు కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు. బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని అన్నారు. మెడికల్ కాలేజీల విషయంలోనూ చిన్నచూపే చూశారని అసహనం వ్యక్తం చేశారు. తాను చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. నా బిడ్డను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన చెందారు.