కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట KCR తొలి డిమాండ్

by GSrikanth |
కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట KCR తొలి డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రెండు ప్రమాదాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇవాళ ఉదయం నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. పండుగపూట ఒక్కసారిగా అనుకోని వార్త వినడంతో బాధిత కుటుంబాల్లోనే కాకుండా ఆయా గ్రామాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఇటీవల తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రెస్ట్ తీసుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed