- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ రేపటి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఇదే.. ఆ జిల్లాలో ప్రెస్ మీట్
దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రేపు జిల్లాల్లో పర్యటించనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో నీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లిలోను ఫామ్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. ఉదయం 10:30 లకు జనగామ జిల్లా ధరావత్ తండాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం 11:30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, అర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు అక్కడే లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకుంటారు.