బీజేపీ నుంచి సుపారీ తీసుకున్న కేసీఆర్: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

by Shiva |
బీజేపీ నుంచి సుపారీ తీసుకున్న కేసీఆర్: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎంకు సొంత జిల్లా అనేది ఉండదని, రాష్ట్రం మొత్తానికి ఆయనే సీఎం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ దగ్గర కేసీఆర్ సుపారి తీసుకున్నాడని ఆరోపించారు. కుటుంబం కోసం లక్షలాది మంది కార్యకర్తలకు కేసీఆర్ మోసం చేశాడని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ను బీజేపీకి కన్వర్ట్ చేయడం వల్లే పాలమూరు పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఓటమి పాలైందని అన్నారు. అయితే, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంఖ్యను 65 స్థానాలకు చేర్చారని తెలిపారు. బీజేపీ రాముడి పేరు చెప్పుకుని.. డ్రామాలు ఆడి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను గెలుచుకుందని ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు శాతం పెరిగిందని తెలిపారు. బీజేపీది బలుపు కాదని.. వాపు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం చేయలేదని అందుకే ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని మార్చి దళితుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే మేలు జరుగుతుందని అన్నారు. అహంకారంతో విర్రవీగిన కేసీఆర్‌కు ప్రజలు కర్రు‌ కాల్చి వాత పెట్టగా, ఎపీలో అనేక వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిన జగన్‌కు తగిన స్థాయిలో బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed