- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ప్రసంగం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది : వైఎస్ షర్మిల
దిశ, డైనమిక్ బ్యూరో : 'దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది' సీఎం కేసీఆర్ ప్రసంగం అని మరోసారి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణను తాలిబాన్ల రాజ్యంగా మార్చాడని ఆరోపించారు. 'ప్రజల అభిప్రాయాలు గెలవాలట... ఇచ్చిన హామీలు నెరవేర్చాలట.. నీ ఏలుబడిలో ఏనాడైనా ప్రజలను గౌరవించావా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యవాదులను ఆదరించావా? అని నిలదీశారు. కనీసం జర్నలిస్టులకైనా గౌరవం ఇచ్చావా? గడీ దాటి నీ అడుగు బయట పడితే.. అక్రమ అరెస్టులు అంటూ షర్మిల మండిపడ్డారు. నెరవేర్చాలని శ్రీరంగనీతులు చెబుతుండు.. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చావా? రైతు రుణమాఫీ ఏది? ఇంటికో ఉద్యోగం ఏది? డబుల్ బెడ్రూం ఇల్లు ఏది? దళితులకు మూడెకరాల భూమి ఏది? నిరుద్యోగ భృతి ఏది? పోడు పట్టాలు ఏవి? తెలంగాణను అప్పులపాలు చేసి పోలీసులను పనోళ్లలా వాడుకుంటూ, అక్రమ కేసులు బనాయిస్తూ, నియంత నిర్ణయాలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ తెలంగాణలో దొరల పాలన సాగిస్తూ తాలిబాన్ల రాజ్యంగా మార్చిండు'అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది కేసీఆర్ గారి ప్రసంగం."ప్రజల అభిప్రాయాలు గెలవాలట...ఇచ్చిన హామీలు నెరవేర్చాలట.." నీ ఏలుబడిలో ఏనాడైనా ప్రజలను గౌరవించావా? ప్రజాస్వామ్యవాదులను ఆదరించావా? కనీసం జర్నలిస్టులకైనా గౌరవం ఇచ్చావా? గడీ దాటి నీ అడుగు బయట పడితే.. అక్రమ అరెస్టులు.. 1/4
— YS Sharmila (@realyssharmila) January 13, 2023
- Tags
- Y. S. Sharmila