కేంద్రంలో సంకీర్ణంపై KCR సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
కేంద్రంలో సంకీర్ణంపై KCR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ జాతీయ టీవీ ఛానెల్‌తో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమికి 200 సీట్లకు మించి రావు అన్నారు. ఏపార్టీకైనా, ఏ కూటమికైనా స్పష్టమైన మెజార్టీ రాకపోతే తాను ఏం చేస్తానంటూ అడుగుతున్నారు.. దీనిపై ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని.. ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. తనకున్న సమాచారం ప్రకారం.. బిహార్, మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్, ఢిల్లీ వంటి చోట్ల ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతోందన్నారు. వచ్చే ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రాంతీయ పార్టీలు నిర్ణయిస్తాయన్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ పాత్ర ఉండదన్నారు.

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయన్నారు. ఇండియా కూటమి పెద్ద కూటమే కాదని.. ఎన్డీయే నుంచి పలు పార్టీలు వెళ్లిపోయాయని కేసీఆర్ అన్నారు. తాను థర్డ్ ఫ్రంట్‌కు రెడీ అని.. కూటమి ఏర్పాటుకు సారధ్యం వహించే ప్రయత్నం చేస్తా అన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అసంభవం కాదన్నారు. కూటమి ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. మంచి సంఖ్యా బలంతో తాను ముందుకెళ్తా అన్నారు. పక్కరాష్ట్రంలో మీ మిత్రుడు చంద్రబాబు బీజేపీ కూటమిలో ఉన్నారు కదా అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఎన్డీయేలో ఉంటే చంద్రబాబు కూడా నష్టపోతారన్నారు.

Read More...

ఇదెక్కడి అరాచకం.. కేసీఆర్ గొంతుపై మాత్రమే నిషేధమా: కేటీఆర్

Next Story

Most Viewed