- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుంది.. నేను మళ్లీ ముఖ్యమంత్రి అవుతా: KCR
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ కుంభకోణం మొత్తం భోగస్ అని, కేసు ప్రధాని మోడీ సృష్టి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తన కూతురును అక్రమంగా అరెస్ట్ చేశారని.. కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లిక్కర్ కుంభకోణంతో కవితకు ఏమాత్రం సంబంధం లేదని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారని అన్నారు. 100 రోజుల్లోనే ప్రజల్లో అసహనం పెరిగిపోయిందని తెలిపార. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని.. తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అధికారం అని జోస్యం చెప్పారు.
అమలుకు సాధ్యం కానీ హామీలను నమ్మి, ఒక భ్రమలో కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేశారని తమ సర్వేలో తేలిందని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కీలక సూత్రధారి. తాము సంతోష్‌పై కేసు పెట్టామని కక్ష గట్టి నా కూతురు కవితపై అక్రమ కేసు పెట్టించారని అన్నారు. మోడీ పాపం మూటగట్టుకుంటున్నారు.. బీజేపీ ఫలితం అనుభవించక తప్పదని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు లిక్కర్ స్కామ్ కాదు.. ప్రధాని మోడీ పొలిటికల్ స్కీమ్ అని అన్నారు. బీజేపీ మాట వినని అమాయకులను ఈ కేసులో ఇరికించి వేధిస్తున్నారని తెలిపారు. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. ఎన్నికల వేళ అరెస్ట్ చేయడం, సీఎంకు బెయిల్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. మోడీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు.