- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించిన కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కీలక హామీ!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సిరిసిల్లలో ఎండిపోయిన పంటలను స్థానిక బీఆర్‌ఎస్ నేతలతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన పథకాలన్నీ ఎప్పుడు అమలు చేస్తారని.. పథకాలన్నీ నెరవేర్చేవరకు వదిలిపెట్టేదే లేదన్నారు. బంగారు తెలంగాణ నాలుగు నెలల్లో ఎడారి అయ్యిందని ఆరోపించారు. తెలంగాణలో పరిపాలన అవగాహన లేని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. కల్యాణ లక్ష్మిలో లక్ష సాయంతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. నాలుగు వేల పింఛన్ ఇస్తానన్నారు ఏమైంది? అంటూ మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో త్వరలోనే నిజానిజాలు బయటపెడతాన్నారు. తెలంగాణకు పదేళ్లుగా సీఎంగా ఉన్నానని ఏ సమయంలోనైనా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కచ్చితంగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తానని కేసీఆర్ వివరణ ఇచ్చారు.