- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తెలంగాణలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన KCR
దిశ బ్యూరో, మహబూబ్ నగర్/నాగర్ కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు. రోడ్డు మార్గం ద్వారా నాగర్ కర్నూల్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బృందానికి స్థానిక ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న తదితరులు ఘన స్వాగతం పలికారు. భోజన విరామం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ చేరుకున్నారు. అక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి పథకం పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్, మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఎత్తిపోతలకు సంబంధించి మొదటి లిప్ట్ బటన్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణా జలాలతో నింపి పూజలు చేయబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని గ్రామాలకు చేరవలసిన కలశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు చేశారు. అనంతరం వాటిని రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు కలశాలను అందుకొని ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించారు. ముఖ్యమంత్రి రాకతో నార్లాపూర్ గ్రామం అంత సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర అధికారులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.