- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Y S Sharmila: నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడంలో కేసీఆర్ దిట్ట
దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రెండు సార్లు సీఎంగా ఎన్నికైన కేసీఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. బంగారు తెలంగాణ చేస్తానని, ఉద్యోగాలు కల్పిస్తానని, నీటి కొరత లేకుండా చేస్తానని చెప్పిన కేసీఆర్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రూ. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాలకు నిధులు లేకుండా పోయాయని, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ సహా చాలా పథకాలకు నిధులు లేకుండా పోయాయని మండిపడ్డారు. ఉద్యోగాలు లక్షల్లో ఖాళీగా ఉంటే కేవలం కంటి తుడుపుగా భర్తీ చేపట్టి మభ్యపెడుతున్నారని అన్నారు. అలాగే నీటి కోసమంటూ చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో అవినీతిని ఏరులై పాలిస్తున్నారని.. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడంలో కేసీఆర్ దిట్ట అంటూ విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. తెచ్చిన అప్పులను కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపంలో కేసీఆర్ తినేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ బయటకొస్తారన్నారు. 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ ఆడిందే ఆటగా సాగుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి బీడి బిచ్చం, కల్లు ఉద్దెర అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. మరోవైపు, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కేసీఆర్‌కు అమ్ముడుపోయాయంటూ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంగళవారం వైఎస్ షర్మిల చేస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 189వ రోజు నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం కనకపూర్ గ్రామంలో షర్మిలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల కేసీఆర్ పై విరుచుకుపడ్డారు