- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రైతు బంధు నిధుల విడుదలకు కొత్త తేదీ ప్రకటించిన కేసీఆర్..!
దిశ, వెబ్‌డెస్క్: రైతు బంధు నిధుల పంపిణీకి ఈసీ బ్రేక్ వేయడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆందోల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు డబ్బులను కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు చేసి ఆపారని ఆరోపించారు. రైతు బంధు ఆగితే కాంగ్రెస్‌కి ఓట్లు వస్తాయనుకుంటున్నారు మండిపడ్డారు. కేసీఆర్ బతికి ఉన్నంతకాలం రైతు బంధు అపుతారా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ నేతలు దుబారా అంటున్నారు.. రైతు బంధు ఉండాలా వద్దా అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రల చేసి రైతు బంధు నిధుల పంపిణీని ఆపిన.. డిసెంబర్ 3న గెలిచేది మనమే.. డిసెంబర్ 6 తర్వాత ఠంచన్‌గా రైతు బంధు డబ్బులు రైతుల ఎకౌంట్లలో వేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే డిసెంబర్ 6వ తేదీ నుండి రైతు బంధు నిధులు జమకానున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఆన్ గోయింగ్ స్కీమ్ కింద బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు రైతు బంధు నిధుల విడుదలకు ఇటీవల ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా రైతు బంధుపై మాట్లాడకూడదని ఆదేశించింది. అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు రైతు బంధు పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలానా తేదీ.. ఫలానా సమయానికి రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. హరీష్ రావుచేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో రైతు బంధు నిధుల విడుదలకు అనుమతి రద్దు చేస్తున్నామని ఈసీ పేర్కొంది.
రైతు బంధు నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని నిరాకరించింది. రైతులు ఖాతాల్లో డబ్బలు జమ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, చివర్లో రైతు బంధు నగదు విడుదలకు ఈసీ బ్రేక్ వేయడంతో ఈ టాపిక్ స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధును కాంగ్రెస్ పార్టీనే అడ్డుకుందనే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం వల్లే నిధుల విడుదలకు చివరి నిమిషంలో ఈసీ బ్రేకులు వేసిందని కాంగ్రెస్ పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి.