మామా అల్లుళ్లకు ఝలక్.. ఎఫెక్ట్ చూపని KCR, హరీశ్‌రావు

by Sathputhe Rajesh |
మామా అల్లుళ్లకు ఝలక్.. ఎఫెక్ట్ చూపని KCR, హరీశ్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ సిట్టింగ్ స్థానం చేజా రడంతో మామా అల్లుళ్ల పొలిటికల్ ప్రభావం ప్రశ్నా ర్థకంగా మారింది. బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న సీటును కోల్పోవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. కేసీఆర్, హరీశ్ రావు ప్రభావం ఉన్నా ఓటమి చవిచూడటం పార్టీ చరిత్రలోనే ఫస్ట్ టైం. దీంతో పార్టీ కేడర్‌లో నైరాశ్యం నెలకొంది.

పార్టీ చరిత్రలో తొలిసారి

పార్టీ స్థాపించిన నాటి నుంచి బీఆర్ఎస్‌కు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం కంచుకోట. 2004లో పార్టీ అభ్యర్థిగా ఆలె నరేంద్ర మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో విజయశాం తి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వా త 2014లో జరిగిన ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీ ఆర్ విజయం సాధించగా, అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో ఎంపీ పదవికి రాజీనా మా చేశారు. ఉప ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి హరీశ్ రావు, గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా..

ఈ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. సిద్దిపేటలో 1,05,514 ఓట్లు, మెదక్‌లో 76,969 ఓట్లు, నర్సాపూర్‌లో 88,410, సంగారెడ్డిలో 83,112, పటాన్‌చెరులో 1,05,387, దుబ్బాకలో 97,879, గజ్వేల్‌లో 111684 ఓట్లు వచ్చాయి. ఒక్క సిద్దిపేట, గజ్వేల్‌లోనే గులాబీ పార్టీకి 2,17,198 ఓట్లు వచ్చాయి. ఏడు నియోజకవర్గాల్లో 14,37,897 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్‌కు 2,48,074 ఓట్ల మెజార్టీ వచ్చింది. లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,11,628 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక్క మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది.

రెండు పార్టీలకు షాక్

లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. ఒక్క అసెంబ్లీ స్థానం గెలుచుకోనప్పటికీ ప్రజలంతా కమలానికి పట్టం కట్టారు. రెండోస్థానానికి కాంగ్రెస్ రాగా, కారు మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది. డిఫరెంట్ తీర్పులు ఓట ర్లు ఇటు బీఆర్ఎస్‌కు, అటు కాంగ్రెస్‌కు షాక్ ఇ చ్చారు. పార్టీ అధినేత కేసీఆర్, ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావు ప్రత్యేక ఫోకస్ పెట్టినా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోక తప్పలేదు.

Advertisement

Next Story