- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణను నాశనం చేస్తానంటే.. విశ్రమించకుండా యుద్ధం చేస్తా: KCR
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్‌లో పర్యటించిన కేసీఆర్.. రోడ్డు షోలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలవగానే క్షణాల్లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. మరీ హామీ ఇచ్చినట్లుగా చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు బంధు నిధులు అందలేదని ఫైర్ అయ్యారు. పెళ్లి చేసుకునే యువతులకు తులం బంగారం ఇస్తామని అన్నారు.. మరీ ఇచ్చారా అని ప్రశ్నించారు.
స్వరాష్ట్రాన్ని సాధించిన తన కళ్లముందే తెలంగాణను నాశనం చేస్తానంటే విశ్రమించకుండా యుద్ధం చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. పదేళ్లలో ప్రధాని మోడీ ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని ఫైర్ అయ్యారు. 150 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి తెలంగాణకు కేటాయింలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో మోడీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారని హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.