- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ కుటుంబం: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మోసాలకు కేసీఆర్ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సింహం లాగా గర్జిస్తూ చేసిన ప్రసంగం గుంట నక్కల గుండెల్లో గుబులు రేపింది అన్నారు. ఆ సమావేశం విజయవంతం కావడంతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది అని, ప్రధానమంత్రి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. అసలు సిసలైన మోసగాళ్లు కేసీఆర్ కుటుంబమే అని జితేందర్ రెడ్డి ఆరోపించారు.
‘అధికారం కోసం బీజేపీ నాయకులు కలలు కంటున్నారు అని మంత్రి చెప్పుకొచ్చారు. మేము నిద్ర పోతే కదా పగటి కలలు కనడానికి. ప్రధానమంత్రితో సహా పార్టీ శ్రేణులంతా పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి అహర్నిషలు శ్రమిస్తున్నారు. ఇక నుంచి ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీదే విజయం’ అని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలోకి వలసలు పెద్ద ఎత్తున ఉంటాయని, కేసీఆర్ ఈ పార్టీలోకి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని జితేందర్ రెడ్డి చమత్కరించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బూటకమని, ప్రజలను మభ్యపెట్టడానికి ఈ పథకాన్ని చేపట్టారని అన్నారు. దమ్ముంటే అనుమతులు తీసుకురావాలని, ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తామని జితేందర్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు శాంత కుమార్, ప్రభాకర్, పద్మజా రెడ్డి, వీరేందర్ గౌడ్, ప్రదీప్ గౌడ్, భరత్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి తదితరులు ఉన్నారు.