టీకాంగ్రెస్ నేతలతో జూమ్ లో కేసీ వేణుగోపాల్ భేటీ

by Prasad Jukanti |
టీకాంగ్రెస్ నేతలతో జూమ్ లో కేసీ వేణుగోపాల్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జూమ్ మీటింగ్ లో భేటీ అయ్యారు. మంగళవారం జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో పాటు ఇన్ చార్జీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార వ్యూహంపై కేసీ వేణుగోపాల్ కీలక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేతల సభలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, ఏఐసీసీ నిర్వహించిన సర్వేలలో నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాలను రాష్ట్ర నేతలకు వివరించినట్లు సమాచారం.

Next Story

Most Viewed