Viral Post: ఆలుమగలు.. ఎవరి దారి వారిదే!

by Vennela |
Viral Post: ఆలుమగలు.. ఎవరి దారి వారిదే!
X

దిశ, వెబ్ డెస్క్: Viral Post: సోషల్‌ మీడియాలో ఓ పోస్టు తెగ వైరల్‌(Viral Post) అవుతోంది.. అది పెళ్లి గురించి..దీంతో అంతా ఆ పోస్టు గురించే మాట్లాడుకుంటున్నారు.ఇంతకీ ఏంటా పోస్ట్? ఎందుకు వైరల్‌ అవుతోంది.. తెలుసుకునేందుకు ఆర్టికల్‌ చదవండి!

ఇద్దరూ ఒకే మంటపంలో.. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశారు. అడుగులు ఒక్కసారే వేశారు కానీ మార్గాలు మాత్రం తర్వాత వేరయ్యాయి. ఒకే గదిలో ఉంటారు. కానీ గుండెల్లో దూరం ఉంటుంది.. ఖర్చులు పంచుకోరు.. ఎవరి డబ్బులు వారివే.. ఇది నిజమైన వివాహమా? లేక కేవలం ఒప్పందమా? ఇది సహజమైన మార్పా? లేక నిస్సహాయతా? భవిష్యత్తులో ఈ బంధం ఈ బంధాలు ఎలా మలుపు తిప్పుకోనున్నాయా? వివాహా వ్యవస్థ పూర్తిగా మారిపోనుందా? ప్రేమతో నిండిన బంధమా? లేక కేవలం ఓ అబ్లిగేషన్‌ మాత్రమేనా? ఇది కొత్త తరహా వివాహమా? లేక బంధానికి వచ్చిన కొత్త రూపమా? ఈ మార్పు సహజమా? లేక సమాజం మౌనంగా అంగీకరిస్తున్న విచిత్రమా?

ఒకే మంటపం, ఒకే అగ్ని, ఒకే మంత్రాలు.. ఇద్దరూ ముడిపడిన చేతులు.. కానీ ఆ ముడికి దారం తెగిపోయేలా అనిపిస్తోంది. ఒకే గదిలో జీవనం, కానీ మనసుల మధ్య గోడలు! అంతర్లీనంగా విడిపోయిన బంధం, కేవలం కలిసి ఉన్న ఛాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. పెళ్లయిన మూన్నళ్లకే ముచ్చట తీరిపోతోంది. కలిసి బతకడం మా వల్ల కాదంటూ విడాకులు తీసుకుంటున్నారు. నవదంపతులు కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. పెళ్లి పెటాకులు చేసుకుంటున్నారు. సంసారాన్ని రోడ్డుపై పడేసుకుంటున్నారు. పెళ్లంటే నూరేళ్లు పంట..అని పెద్దలు అంటుంటారు. సంప్రదాయ వివాహాల్లో కుటుంబం, గోత్రం, ఆస్తి, అంతస్తు, మంచి ఉద్యోగం అన్నీ చూసుకుని జాతకాలు కుదిరితేనే పెళ్లి చేస్తున్న జంటలు కూడా నెలల వ్యవధిలోనే అపోహలతో విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి.


విడాకులకు కాస్త దూరంగా ఉంటున్న దంపతులు(Couple) కూడా ఎవరి దారి వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇద్దరూ సంపాదిస్తున్నారు.. కానీ ఖర్చులు మాత్రం వేర్వేరు. ఇద్దరు కలిసి ఉండేది ఒకే చోటు. అయినా మనస్సులు మాత్రం ఒకటి కాదు. ఇప్పుడు ఇదే సిట్యుయేషన్ ఉంది. ఏ బంధమైన ఎక్కువ కాలం నిలబడేది..ముఖ్యంగా భార్యభర్తల మధ్యన ప్రధానంగా ఉండాల్సింది కమ్యూనికేషన్. ఇది లేకపోవడంతోనే వారి వైవాహిక బంధం బీటలువారుతోంది. అందుకే ఆర్థిక సమస్యలైనా, కుటుంబ వ్యవహారమైనా ఇద్దరు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటే బంధంగా బలంగానే ఉంటుంది. లేదంటే బంధాన్ని శాశ్వతంగా దూరం చేసుకోవాల్సి వస్తుంది.

Next Story