- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగియనున్న కవిత జ్యుడిషియల్ రిమాండ్.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ తరపున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ సోమవారం ముగియనున్నది. దీంతో ఆమె రిమాండ్‌ను పొడిగించడంపై రౌస్ ఎవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోనున్నది. స్పెషల్ జడ్జి కావేరీ బవేజా నేతృత్వంలో మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ ప్రారంభం కానున్నది. కవితను ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు పర్చడమా?... లేక వర్చువల్‌గా జైలు నుంచే విచారణకు హాజరు కానున్నారా?... అనే అంశంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై సోమవారం ఉదయం స్పష్టత ఇవ్వనున్నారు. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడానికి కోర్టు గతంలోనే ఆమెకు వెసులుబాటు ఇచ్చింది.
జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు రిమాండ్‌ను ఎన్ని రోజులు కోర్టు పొడిగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఈ నెల 24న విచారణ జరగనున్న నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్ ఎప్పటివరకు విధిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా ఈడీ ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్‌ను కూడా స్పెషల్ జడ్జి పరిశీలించి పరిగణనలోకి తీసుకోవడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈడీ తరపు వాదనలను విన్న తర్వాత క్లారిటీ రానున్నది.