నేడు ఈడీ విచారణకు కవిత ‘నో’

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-16 09:02:26.0  )
నేడు ఈడీ విచారణకు కవిత ‘నో’
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కాలేనని కవిత ఈ మెయిల్ ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే అధికారులు ఆమెను విచారించేందుకు మరో తేదీని కేటాయిస్తారా? లేదంటే తప్పనిసరిగా విచారణకు రావాలని కోరతారా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీం కోర్టులో కేసు విచారణకు ఉన్న కారణంగా ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు కవిత తెలిపారు. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ రోజు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉండగా తన న్యాయవాది భరత్ ద్వారా పలు కీలక పత్రాలను పంపారు. మహిళలను కార్యాలయానికి పిలిచి విచారణ చేయడం తగదని, ఆడియో, వీడియో విచారణకు సిద్ధమని కవిత లేఖలో పేర్కొన్నారు. తన ఇంటికి వచ్చి అధికారులు విచారణ చేయొచ్చని కవిత తెలిపారు. ఈ నెల 11న విచారణకు సహకరించానని, 8 గంటల వరకు ఈడీ అధికారులు తనను విచారించారని కవిత తెలిపారు. ఈ రోజు విచారణకు రావాలని ఈడీ కోరగా వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లలో మెన్షన్ చేయలేదన్నారు.

మీరు అడిగిన వివరాలను నా ప్రతినిధి భరత్ ద్వారా పంపాను అని కవిత తెలిపారు. హక్కుల కోసం సుప్రీం కోర్టుకు వెళ్లానని ఈనెల 24న పిటిషన్ సుప్రీంలో విచారణకు రానున్నట్లు కవిత తెలిపారు. లాయర్ భరత్ ఈడీ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తదుపరి ఆదేశాల ప్రకారమే తాము ముందుకెళ్తామన్నారు. అనారోగ్యం అని అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సుప్రీం ఆదేశాల మేరకు ఇంటి వద్దే విచారించాలని తెలిపారు.

Read more:

బిగ్ బ్రేకింగ్ : కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

ఢిల్లీలో కవిత కోసం అంతా రెడీ అవుతుంది: Bandi Sanjay

Advertisement

Next Story

Most Viewed