- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్.. ట్విట్టర్‌లో Kalvakuntla Kavitha
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె ఓ పోస్టు పెట్టారు. ''రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారు. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ ను దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్, దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి,తెలంగాణ రాష్ట్రం తెచ్చారు' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యేనని తెలిపారు. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక కేరళ రాష్ట్రం వాయనాడ్ కు రాహుల్ గాంధీ వెళ్లాడన్నారు. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో కాంగ్రెస్ పార్టీ పైనే ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి గెలిచానని కవిత స్పష్టం చేశారు.
Read more: