- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kavitha: ఆడబిడ్డల పండుగలపై ఆంబోతులను వదిలారా?.. సీఎం పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: బతుకమ్మ మీద మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మరోసారి బతుకమ్మ (Bathukamma) మీద మాట్లాడేముందు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) హెచ్చరించారు. మీ ప్రతి మాటలను తెలంగాణ ఆడబిడ్డలు గమనిస్తున్నారని మర్చిపోవద్దన్నారు. కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ గతంలోనే జీవో జారీ చేసింది. రాష్ట్ర పండగను అవమానించేలా కాంగ్రెస్ మంత్రులు, నాయకులు బతుకమ్మను అవమానించేలా మాట్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. ఆంబోతులను వదిలినట్లు ఆడబిడ్డల పండగలపై మాట్లాడేందుకు మీ మంత్రులను, మీ నాయకులను వదిలిపెట్టారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత ఓట్ల కోసం గతంలో కాంగ్రెస్ అగ్రనేతలు బతుకమ్మ పట్టుకుని శుభాకాంక్షలు చెప్పలేదా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బతుకమ్మ ఎత్తుకుని శుభాకాంక్షలు చెప్పారు, ట్వీట్లు చేశారు. ఒక సందర్భంలో రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి కోలాటం బతుకమ్మ కలిసి ఆడారని వీడియో ప్రదర్శించారు. కానీ ఇవాళ వెర్రి ప్రశ్నలు, వింత ప్రశ్నలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలే కాదు, సామాజికి కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు వారికి వ్యతిరేకంగా చిన్న పోస్టు చేసినా ప్రతి జిల్లాల్లో కేసులు పెడుతున్నారు. మంత్రులు, నాయకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ను ఎన్ని తిట్లు తిట్టినా ఏనాడు కేసులు పెట్టలేదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
ఊరూరా ఊరేగించి విగ్రహాలు ప్రతిష్టిస్తాం:
తెలంగాణ తల్లి (Telangana thalli statue)పై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్ ఇవ్వడం దారుణమైన విషయం అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి రూపం మార్చడానికి ప్రజల ఆమోదం ఉన్నదే నిజమైతే జీవోతే ఏం పని? మరో రకంగా విగ్రహం పెడితే కేసులు పెడతామని బెదిరించే గెజిట్ ఎందుకిచ్చారని నిలదీశారు. ముఖ్యమంత్రికి దేనికి ఇంత పిరికితనం అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్, తెలంగాణవాదుల ఆధ్వర్యంలో వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్టిస్తామన్నారు. ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు. మంచి పనులు చేయండన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. జీవో ఇస్తేనే భరతమాత విగ్రహాలు పెట్టుకున్నామా అని ప్రశ్నించారు. లక్షలాదిగా తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. ఉద్యమంలో స్ఫూర్తినింపిన తల్లి కాబట్టి విగ్రహాలు పెట్టుకున్నాం.
ఏపీకి ప్రయోజనం చేసిన అధికారికి పదవి ఎందుకోసం?:
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యంధ్రను కోరుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ వాదన చేశారో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అదే వితండ వాదం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీది తెలంగాణ వాదం కాదని కేవలం కాంగ్రెస్ వాదం అని ఆరోపించారు. నీళ్లకోసం తెలంగాణ ప్రాంత ప్రజలంతా పోరాటం చేశామన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకో టీఎంసీ నీళ్లను తరలించవచ్చు అని ఆదేశాలు ఇచ్చిన ఆధిత్యనాథ్ దాస్ అనే ఏపీ మాజీ సీఎస్ గా పని చేసిన రిటైర్డ్ ఆఫీసర్ ను రేవంత్ సర్కార్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో అడ్వైజరిగా నియమించిందని విమర్శించారు. ఎవరి ప్రయోజనాలు కోరుకుని అతడిని నియమించారని ప్రశ్నించారు. మనకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చిన వ్యక్తి తెలంగాణ ప్రయోజనాలను ఏం కాపాడగలరో చెప్పాలని సీఎంను ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వారి పార్టీ ప్రయోజనాలే తప్ప తెలంగాణ ప్రయోజనాలకు మీకు పట్టవన్నారు.