కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సమంజసం కాదు: కొనగాల మహేష్

by Mahesh |
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సమంజసం కాదు: కొనగాల మహేష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ కొనగాల మహేష్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అసలు రంగు ఇప్పుడు బయట పడుతుందని , ఆంధ్రావాళ్లను సెటిలర్లు బతకడానికి వచ్చారని చెప్పడంలోనే తేలిపోయిందన్నారు. కౌశిక్ రెడ్డి కావాలని తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇదంతా కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్ లోనే జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న వాళ్ళిద్దరి పై కేసులు నమోదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Advertisement

Next Story

Most Viewed