- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Prakasham Barrage: ప్లాన్ సక్సెస్..ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న ఓ భారీ బోటును తొలగించిన ఇంజినీర్లు
దిశ, వెబ్డెస్క్:కృష్ణా నది(Krishna River)లో ఈ నెల 1వ తేదీన వచ్చిన భారీ వరద ప్రవాహానికి భారీ బోట్లు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage) గేట్ల వద్ద చిక్కుకున్న సంగతి తెలిసిందే.గత ఏడు రోజులుగా ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్నఈ బోట్లను తొలగించడానికి ఇంజినీర్లు, అధికారులు అనేక ఇబ్బందులు పడ్డారు.అయితే ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది.మంగళవారం రాత్రి 40 టన్నుల భారీ బోటును బెకెం ఇన్ఫ్రా(Bekem Infra) సంస్థ ఇంజినీర్లు బయటకు తెచ్చారు. అయితే అధికారులు ఇప్పటివరకు వివిధ ప్లాన్ లతో బోట్లను తొలగించడానికి ప్రయత్నించగా నిరాశే ఎదురయ్యింది.అయితే ఈ సారి ఇంజినీర్లు సరికొత్త వ్యూహంతో ఓ బోటును తొలగించారు. ఈ ప్రక్రియలో భాగంగా రెండు భారీ బోట్లకు గడ్డర్లను అమర్చి చిక్కుకున్న బోటును బయటకు తీసుకొచ్చారు.కాగా బ్యారేజీ వద్ద ఇంకా రెండు భారీ బోట్లు, మరో చిన్న బోటు చిక్కుకొని ఉన్నాయి. ఈ బోట్లను రేపు ఇంజినీర్లు బయటకు తీసే అవకాశముంది.