- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Accident:ఆటో బోల్తా మహిళ మృతి.. పలువురికి గాయాలు
by Jakkula Mamatha |
X
దిశ, పత్తికొండ :వ్యవసాయ పనుల నిమిత్తం గురువారం ఉదయం పత్తికొండ నుంచి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి వెళ్తున్న కూలీల ఆటో బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఆటో బోల్తాపడి మహిళా కూలీ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పత్తికొండకు చెందిన మహిళా కూలీలు రోజూలాగే కొత్తపల్లి గ్రామంలో పత్తి పొలాలకు కూలీ పనికి వెళ్లారు. కొత్తపల్లి గ్రామానికి సమీపంలో ఒక బైకు వీరి ఆటోకు ఎదురుగా వేగంగా రావటంతో ఆటో డ్రైవర్ బైకును తప్పించబోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడిపోయింది. ఆటోలో 14 మంది కూలీలు ఉండగా 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పత్తికొండ ప్రకాష్ నగర్‌కు చెందిన లక్ష్మీదేవి (55) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story