Purandeshwari: జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ కూడా ఆలోచించాలి.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

by Shiva |
Purandeshwari: జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ కూడా ఆలోచించాలి.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) అన్నారు. ఇవాళ ఆమె రాజమండ్రి (Rajahmundry)లో మీడియాతో మాట్లాడుతూ.. ‘వన్ నేషన్.. వన్ ఎలెక్షన్‌’ (One Nation.. One Election)కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని గుర్తు చేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఒకేసారి ఎన్నికల కోడ్‌ (Election Code) విధించడం వల్ల ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలపై దృష్టి సారించవచ్చని అన్నారు.

దీంతో ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, ఎన్నికల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని, ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Fund) కింది పెట్టుబడి సాయం అందజేస్తుందని అన్నారు. మొత్తం మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు అన్నదాతల ఖాతాల్లో జమ అవుతున్నాయని గుర్తు చేశారు. పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ(NDA Government) హయాంలో రూ.3 లక్షల కోట్ల మేర కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని పురందేశ్వరి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed