గాంధీ భవన్ షెడ్యూల్ లో మార్పులు : టీపీసీసీ క్లారిటీ

by M.Rajitha |
గాంధీ భవన్ షెడ్యూల్ లో మార్పులు : టీపీసీసీ క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ షెడ్యుల్ లో స్వల్ప మార్పులు చేశారు. క్యాబినేట్ మీటింగ్ నేపథ్యంలో మంత్రుల విజిట్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు టీపీసీసీ కార్యవర్గం ప్రకటించింది. వచ్చే వారం నుంచి యధావిధిగా మంత్రుల సందర్శన ప్రోగ్రామ్ కొనసాగుతుందని టీపీసీసీ నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల గాంధీభవన్ కు మంత్రులు విధిగా రావాల్సిందేనని కొత్త పీసీసీ చీఫ్​ఆదేశాలిచ్చారు. వారంలో రెండు రోజుల పాటు సందర్శించాలని కోరారు. దీని వలన పార్టీ నేతలు, కార్యకర్తలు సమస్యలు సంక్షేమంపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని వివరించారు. ఒక్కో మంత్రి మూడు గంటల సమయం ఇస్తే పార్టీ కార్యకర్తలు సంతోషిస్తారంటూ వెల్లడించారు. దీనికి క్యాబినేట్ అంతా అంగీకరించింది. గురు, శుక్రవారాల్లో సందర్శనలను ఫిక్స్ చేశారు. అయితే ఈ రోజు విజిట్ కొరకు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను టీపీసీసీ ఆహ్వానించింది. ఇద్దరిలో ఒకరిని గాంధీభవన్ కు రావాలని కోరారు. అయితే క్యాబినేట్ సమావేశం నేపథ్యంలో ఈ విజిట్ ను వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed