- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India Economy: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
దిశ, బిజినెస్ బ్యూరో: 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ నిలుస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా తెలిపింది. ఈ క్రమంలోనే భారత వార్షిక వృద్ధి రేటు 6.7 శాతంగా అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 8.2 శాతం జీడీపీ వృద్ధితో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థికవ్యవస్థగా మారిన సంగతి తెలిసిందే. ఇది ప్రభుత్వ అంచనా 7.3 శాతం కంటే అత్యధికం. ఈ నేపథ్యంలో 'భారత అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి. వాణిజ్యం, వ్యవసాయం, ఏఐ, నిర్మాణాత్మక సంస్కరణలతో సహా అనేక రంగాల్లో అవకాశాలను కలిగి ఉంది. భారత్ యువత, బలమైన వర్క్‌ఫోర్స్‌తో ప్రపంచ ఆర్థిక రూపురేఖలను మార్చే మెరుగైన స్థానంలో వృద్ధికి సిద్ధంగా ఉందని ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా లీడర్‌షిప్ కౌన్సిల్ హెడ్, ఎస్అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ చీఫ్ డేటా ఆఫీసర్ అభిషేక్ తోమర్ పేర్కొన్నారు. వాణిజ్య ప్రయోజనాలను పెంచుకోవడానికి భారత్ మౌలిక సదుపాయాలు, భౌగోళిక రాజకీయ వ్యూహాలను, ప్రత్యేకించి దేశ విస్తృతమైన తీరప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలని ఎస్అండ్‌పీ తన నివేదికలో సూచించింది. భారత్ దాదాపు 90 శాతం వాణిజ్యం సముద్రమార్గం ఉన్నందున పెరుగుతున్న ఎగుమతులు, బల్క్ కమోడిటీ దిగుమతులను నిర్వహించేందుకు స్థిరమైన ఓడరేవు మౌలిక సదుపాయాలు అవసరం వెల్లడించింది.