Junior Doctors : నేడు జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ.. రేపటి నుంచి అత్యవసర వైద్యసేవలు

by Hajipasha |
Junior Doctors : నేడు జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ.. రేపటి నుంచి అత్యవసర వైద్యసేవలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు శాంతించారు. ఆందోళన కార్యక్రమంలో 42వ రోజైన శుక్రవారం ఆందోళనను విరమించుకుంటామని, శనివారం నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలను ప్రారంభిస్తామని వారు ప్రకటించారు. కొన్ని ఎంపిక చేసిన సాధారణ వైద్యసేవలను కూడా అందిస్తామన్నారు. అయితే ఇంకొన్ని రోజుల పాటు ఓపీడీ వైద్యసేవలకు తాము అందుబాటులో ఉండబోమని జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

ఆందోళన కార్యక్రమంలో చివరి రోజైన శుక్రవారం కోల్‌కతాలోని స్వాస్థ్య భవన్ నుంచి సీజీఓ కాంప్లెక్సు వరకు ర్యాలీ నిర్వహించాలని వైద్యులు భావిస్తున్నారు. ఇటీవలే బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్లు సమావేశమై చర్చలు జరిపారు. వారు ప్రతిపాదించిన డిమాండ్లలో చాలావరకు బెంగాల్ సర్కారు అంగీకరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీని తొలగించాలనే డిమాండ్‌కు నో చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed