- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అణుబాంబు హెచ్చరిక లేఖను దక్కించుకునేందుకు పోటీ... అసలు అందులో ఏముంది? ఎందుకంత డిమాండ్?
దిశ, ఫీచర్స్ : అణు బాంబును అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ కు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ రాసిన లేఖ.. వేలంలో రూ. 32.7 కోట్లకు అమ్ముడైంది. 1939లో రాసిన ఈ లేఖ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యునైటెడ్ స్టేట్స్ తన అణు పరిశోధనలను వేగవంతం చేయాలని కోరడంలో కీలకపాత్ర పోషించింది. ఈ సమయంలో నాజీ జర్మనీ నుంచి పారిపోయిన ఐన్ స్టీన్.. ఆ దేశం అణు ఆయుధాలు తయారుచేయగల సామర్థ్యం గురించి తీవ్ర ఆందోళన చెందాడు. నాజీ శాస్త్రవేత్తలు అణు విచ్ఛిత్తిలో పురోగతిని సాధించే అవకాశం గురించి హెచ్చరించాడు.
ఈ ముప్పును ఎదుర్కొనేందుకు యునైటెడ్ స్టేట్స్ తన సొంత అణు పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. కాగా ఐన్ స్టీన్ లేఖ శాస్త్రీయ పురోగతిని హైలెట్ చేసింది. ముఖ్యంగా యురేనియం శక్తి వనరుగా ఉపయోగించబడుతుందని గుర్తించింది. విధ్వంసక శక్తి బాంబులను తయారుచేసేందుకు ఈ శక్తిని వినియోగించుకోవచ్చని తెలిసింది. ఈ హెచ్చరిక మాన్ హట్టన్ ప్రాజెక్టు ప్రారంభించేందుకు.. మొదటి అణుబాంబుల అభివృద్ధికి దారితీసిన అత్యంత రహస్య చొరవ. అయితే 1945లో హిరోషిమా, నాగసాకిలో అణుబాంబుల దాడి, జరిగిన విధ్వంసం చూసాక.. తాను చేసిన పెద్ద తప్పు ఇదేనని పశ్చాత్తాపానికి గురయ్యాడు ఈ శాస్త్రవేత్త. కాగా ఈ లేఖ ఇంతకు ముందు చాలా మంది చేతులు మారింది. ప్రచురణ కర్త మాల్కం ఫోర్బ్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు పాల్ అలెన్ వంటి ప్రముఖ వ్యక్తుల సేకరణలో భాగమైంది.