- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారానికి ఉల్లిపాయ.. అలా యూజ్ చేస్తే బోలెడు లాభాలు..
దిశ, ఫీచర్స్ : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అంతగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఆనియన్. అయితే ఇది సెక్స్ హెల్త్ మెరుగుపరచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుందని చెప్తున్నారు నిపుణులు. అవును... శృంగారం విషయంలో బోలెడు ప్రయోజనాలను కలిగి ఉండవచ్చని సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఉల్లిగడ్డ.. లిబిడోను పెంచడంతో పాటు మొత్తం పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు తక్కువ సెక్స్ డ్రైవ్‌ను అనుభవిస్తున్నట్లయితే.. మీ ఆహారంలో ఉల్లిపాయలను చేర్చుకోవడం సహాయకరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమో వివరిస్తున్నారు.
రక్త ప్రసరణ మెరుగు
ఉల్లిపాయలు రక్త ప్రసరణను పెంచడం ద్వారా లైంగిక ఆరోగ్యానికి సహాయపడతాయి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా క్వెర్సెటిన్.. రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది ఇరానియన్ జర్నల్ ఆఫ్ బేసిక్ మెడికల్ సైన్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కనుగొనబడినట్లుగా... శరీరం అంతటా ముఖ్యంగా లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. జననేంద్రియాలకు పెరిగిన రక్త ప్రసరణ కోరికను పెంచుతుంది. లైంగిక ఉద్దీపనకు శరీరం మరింత వేగంగా, తీవ్రంగా స్పందించడంలో సహాయపడుతుంది. పనితీరును మెరుగుపరుస్తుంది. లైంగిక అవయవాల్లో సున్నితత్వాన్ని పెంచుతుంది.
టెస్టోస్టెరాన్ స్థాయిల పెరుగుదల
ఉల్లిపాయలలో సల్ఫర్ సమ్మేళనాలు, క్వెర్సెటిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిల పెరుగుదలకు కారణమవుతాయి. అధిక టెస్టోస్టెరాన్ స్థాయిలు బలమైన లిబిడో, మెరుగైన లైంగిక పనితీరుతో ముడిపడి ఉన్నందునా.. పురుషులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది . జర్నల్ బయోమోలిక్యూల్స్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం ఉల్లిపాయలు వృషణాలలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ప్రేరేపించే ల్యూటినైజింగ్ హార్మోన్ ను పెంచుతాయి. టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
మెరుగైన స్టామినా
ఫార్మాస్యూటికల్ బయాలజీలో ప్రచురించబడిన అధ్యయనంలో.. ఉల్లిపాయలు యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలతో నిండి ఉన్నాయి. ఇవి శక్తి స్థాయిలు, శారీరక ఓర్పును గణనీయంగా పెంచుతాయి. ఈ పోషక భాగాలు మొత్తం శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లైంగిక పనితీరుకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయి. మీరు అధిక శక్తిని కలిగి ఉన్నప్పుడు, లైంగిక కార్యకలాపాల సమయంలో అలసటను అనుభవించే అవకాశం తక్కువ.
ఆహారంలో ఎలా చేర్చాలి?
- సలాడ్ లో పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేయండి.
- ఉల్లిపాయ రసం మరింత ప్రయోజనాలను అందించవచ్చు.
- ఫ్రై చేసిన ఆనియన్ ను స్నాక్స్ గా తీసుకోండి.
- ఉల్లి టీ లిబిడో పెంచడంలో పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది.