బీ-ఫార్మసీ, ఫార్మా-డీ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్

by Mahesh |
బీ-ఫార్మసీ, ఫార్మా-డీ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు బీఫార్మసీ, ఫార్మా–డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఇప్పటికే వారందరికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడంతో నేరుగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈనెల 24,25 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని, 27న సీట్ల అలాట్మెంట్ ఉంటుందని వెల్లడించింది. ఈనెల 27,28 తేదీల్లో ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్​లైన్​ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 220 ఫార్మసీ కాలేజీలుండగా, ఒకటీ, రెండు రోజుల్లో యూనివర్సిటీలు ఆయా కాలేజీలకు అఫిలియేషన్లను అందించనున్నాయి.

నేటి నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈనెల 20 నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. శుక్రవారం నిర్ణీత ఫీజు చెల్లించి, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. 21న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని, 21,22 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed