సిరాజ్‌తో పోటీని ఎంజాయ్ చేస్తా : లబుషేన్

by Harish |
సిరాజ్‌తో పోటీని ఎంజాయ్ చేస్తా :  లబుషేన్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌‌తో పోటీని ఆస్వాదిస్తానని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ తెలిపాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో లబుషేన్ మాట్లాడుతూ.. సిరాజ్‌తో అనుబంధం గురించి వెల్లడించాడు. ‘సిరాజ్‌తో పోటీని ఆస్వాదించడానికి చాలా కారణాలు ఉన్నాయి. 2015-16‌లో మేము అకాడమీలో కలిశాం. అతను ఎంఆర్‌ఎఫ్ అకాడమీకి పనిచేస్తున్నాడు. మేము ఒకరికొకరు వ్యతిరేకంగా ఆడాం. అప్పుడు సిరాజ్‌ను మొదటిసారి కలిశాను. అప్పటి నుంచి మా ఇద్దరి కెరీర్‌లు పురోగమిస్తున్నాయి. అందుకు ఆనందంగా ఉంది. క్రికెట్ పట్ల అతనికి అభిరుచి, ప్రేమ ఉన్నాయి. అతను ఎదగడాన్ని చూడటం సంతోషంగా ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, భారత్, ఆస్ట్రేలియా మధ్య త్వరలో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిరాజ్, లబుషేన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆసిస్ గడ్డపైన జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా నవంబర్ 22-26 మధ్య తొలి టెస్టు జరగనుంది.

Advertisement

Next Story