Suicide attempt: న్యాయమూర్తి వేధింపులు.. రైలు కింద పడబోయిన SI.. ఎక్కడంటే..!

by Maddikunta Saikiran |
Suicide attempt: న్యాయమూర్తి వేధింపులు.. రైలు కింద పడబోయిన SI.. ఎక్కడంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్:న్యాయమూర్తి(Magistrate) వేధింపులు తట్టుకోలేక ఓ ఎస్సై ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని అలీఘర్(Aligarh) జిల్లాకు చెందిన సచిన్ కుమార్(Sachin Kumar) అనే సబ్-ఇన్‌స్పెక్టర్(SI) రైలు పట్టాల మీద కూర్చొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఓ బైక్ దొంగతనం కేసులో అదీబ్, ఫైజ్, అర్బాజ్, అమీర్ అలాగే షకీర్‌(Adeeb, Faiz, Arbaaz, Aamir and Shakir)లను SI అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టులో హాజరుపర్చారు.ఈ క్రమంలో కోర్టులో తనపై జడ్జి అభిషేక్ త్రిపాఠి(Abhishek Tripathi) మానసికంగా వేధించడమే కాకుండా ముస్లింలను నకిలీ కేసుల్లో అరెస్ట్ చేశానని న్యాయమూర్తి పదే పదే ఆరోపించారని బాధితుడు వాపోయాడు. ఈ ఆరోపణలతో మనోవేదనకు గురైన సచిన్ కుమార్ రైలు పట్టాలపై కూర్చుని ఆత్మహత్యకు యత్నించాడు.దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి పోలీసు అధికారులు అతనిని రక్షించారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed