Priyanka gandhi: రాజ్యాంగాన్ని అనుసరించే దేశాన్ని పరిపాలించాలి.. ప్రియాంకా గాంధీ

by vinod kumar |
Priyanka gandhi: రాజ్యాంగాన్ని అనుసరించే దేశాన్ని పరిపాలించాలి.. ప్రియాంకా గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతించారు. అనాగరిక చర్యల ద్వారా, దేశంలోని చట్టంపై బుల్డోజర్‌ను నడుపుతూ న్యాయాన్ని తుంగలో తొక్కే వారికి ఇది చెంపపెట్టు లాంటిదని అభివర్ణించారు. రాజ్యాంగం ద్వారా మాత్రమే దేశం పరిపాలించబడుతుందని తెలిపారు. బుల్డోజర్ చర్యలు ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని అణచివేయడమేనని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ చర్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. దీనికి వెంటనే ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వాలు నేరస్థులలా ప్రవర్తించలేవు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువను పాటించడం నాగరిక సమాజంలో పాలనలోని నిబంధనలు. తన కర్తవ్యాన్ని నెరవేర్చలేని వారు సమాజానికి, దేశానికి మేలు చేయలేరు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed