- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రాణాలు తీసే స్క్విడ్ గేమ్ మళ్ళీ వస్తుంది
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓటీటీ వ్యూయర్షిప్ సోంతం చేసుకున్న ప్రాణాలు తీసే స్క్విడ్ గేమ్ వెబ్‌సిరీస్ సీజన్ 2తో మళ్లీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఫస్ట్ సీజన్ పెద్ద విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. స్క్విడ్ గేమ్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. స్క్విడ్ గేమ్ వెబ్‌సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 26 నుంచి వరల్డ్ వైడ్‌గా స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ.. స్క్విడ్ గేమ్ సీజన్2 టీజర్‌ను గురువారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ది గేమ్ విల్ నాట్ స్టాప్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆటలో ఓడిపోయిన 392 నంబర్ జెర్సీ వ్యక్తిని గేమ్ నిర్వాహకులు చంపేసినట్లుగా ఈ పోస్టర్లో చూపించారు. రెడీ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ అంటూ పోస్టర్ కు నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన క్యాప్షన్ సిరీస్‌పై హైప్‌ను మరింత పెంచేసింది. దీంతో ఈ సీజన్లో గేమ్స్ ఇంకెంత భయంకరంగా ఉంటాయన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక స్క్విడ్ గేమ్ రెండో సీజన్ లో లీ జంగ్ జే, పార్క్ హే సూ, హోయాన్ జంగ్ కీలక పాత్రల్లో నటించారు. సీజన్ వన్ మాదిరిగానే సీజన్ 2లో కూడా స్క్విడ్ గేమ్‌లో 456 మంది పాల్గొంటారని, ఇందులో ఎవరు విన్నర్ గా నిలుస్తారు? ఈ 456 మంది ప్రాణాలతో ఉండేది ఎవరన్న ఉత్కంఠను పంచుతుందని సినీమా యూనిట్ చెబుతోంది. రియల్ గేమ్స్‌తో ఈ సిరీస్ సాగనుంది.
సీజన్ 2లో స్క్విడ్ గేమ్ రూల్స్ డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లుగా సమాచారం. ఫస్ట్ సీజన్‌కు మించి ట్విస్ట్‌లు, టర్న్‌లతో సీజన్ 2 సాగుతుందని మేకర్స్ కథనం.
2021లో రిలీజైన స్క్విడ్ గేమ్ సిరీస్1 వ్యూయర్షిప్ పరంగా ఓటీటీలో గత రికార్డులు మొత్తం తిరగరాసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. స్క్విడ్ గేమ్‌కు 1.65 బిలియన్ల స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. ఆడియెన్స్‌కు ఈ వెబ్ సిరీస్ ద్వారా థ్రిల్‌ను పంచుతూనే దక్షిణకొరియాలో ఉన్న పేద, ధనికుల మధ్య ఉన్న అంతరాలు, పెట్టుబడిదారి వ్యవస్థను స్క్విడ్ గేమ్‌లో దర్శకుడు హ్యాంగ్ డాంగ్ హ్యాక్ చూపించాడు.
స్క్విడ్ గేమ్ నడిచేదెట్లా..
స్క్విడ్ గేమ్ సిరీస్ కథలోికి వెళితే అప్పులతో ఇబ్బందులు పడుతోన్న కొందరిని ఈ గేమ్ నిర్వాహకులు ప్రపంచంతో సంబంధం లేని ఒక దీవికి తీసుకెళ్తారు. అక్కడ రకరకాల గేమ్స్‌ను ఆడిస్తూ అందులో ఓడిపోయిన వారిని చంపేస్తారు. చివరికి మిగిలిన వ్యక్తికి ప్రైజ్ మనీని అందజేస్తారు. అయితే ఇదే సమయంలో అసలు ఈ గేమ్‌ను ఎవరు నిర్వహిస్తున్నారన్న అంశం ఆసక్తికరంగా ఉంటుంది. సీజన్1లో గెలిచిన వ్యక్తి, ఆ ముఠాను కచ్చితంగా పట్టుకుంటానని చెప్పడంతో సీజన్1 ముగుస్తుంది. దీంతో సీజన్2 మరింత ఆసక్తికరంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. మరి స్క్విడ్ గేమ్ నిర్వాహకులను హీరో పట్టుకుంటాడా.? ఈ సీజన్లో ఎలాంటి గేమ్స్ ఉంటాయి లాంటి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సీజన్2లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉండనున్నాయి.