‘రాష్ట్రంలో ఏదో ఒక యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టండి’

by Gantepaka Srikanth |
‘రాష్ట్రంలో ఏదో ఒక యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏదో ఒక యూనివర్శిటీకి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ పేరు పెట్టాలని జాతీయ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజు డిమాండ్ చేశారు. కృష్ణస్వామి ముదిరాజ్ 131 జయంతి వేడుకలను సోమవారం హైదరాబాదులోని రాష్ట్ర ముదిరాజ్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కృష్ణస్వామి ముదిరాజ్ సేవలు మరువలేమని కొనియాడారు. సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. బడుగు బలహీనర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజ్ అని అన్నారు. హైదరాబాద్ తొలి మేయర్ కోర్వి కృష్ణస్వామి ముదిరాజ్ సేవలను సర్కార్ విస్మరించిందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సొసైటీ చైర్మన్ జ్ఞానేశ్వర్, నేషనల్ ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశం, సాపన్న దేవ్, జగన్మోహన్, అంబటి చెన్నయ్య, సదానంద్, శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story