- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కర్నాటక వ్యూహాలు అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: సాధారణ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన నాయకులతో ఏఐసీసీ నేతలు లోతుగా చర్చించామని, రాహుల్‌గాంధీ సహా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దిశానిర్దేశం చేశారని పీసీసీ చీఫ్ రేవంత్ వివరించారు. అనేక సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన రోడ్ మ్యాప్ గురించి వివరించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 120 రోజుల్లో ఎన్నికలకు వెళ్ళడం గురించి చర్చించినట్లు తెలిపారు. ఏఐసీసీ ఆఫీస్‌లో సుమారు రెండున్నర గంటలకు పైగా జరిగిన స్ట్రాటెజీ మీటింగ్ వివరాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు మీడియాకు వివరించారు.
పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని, పదేళ్ళుగా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని, మోడీ అధికార దుర్వినియోగాన్ని ప్రజలకు వివరించాలని ఈ సమావేశంలో చర్చించుకున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల కార్యాచరణ మొదలైందని రేవంత్ వ్యాఖ్యానించారు. బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని అగ్రనేతలు సూచించారని తెలిపారు.
ఎక్కెడక్కడ పార్టీ నిర్మాణంలో ఖాళీల ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసుకుంటామన్నారు. ఎన్నికలకు కార్యకర్తలను, నాయకులను సన్నద్ధం చేసుకునే ప్రక్రియ ఈ సమావేశంతో మొదలైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయబోతున్నామో వివరించే మేనిఫెస్టో తయారీపైనా, ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చనున్నదో చర్చించామన్నారు.
కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో అవినీతి ఆకాశమంత ఎత్తుకు పెరిగిందని, అభివృద్ధి మాత్రం పాతాళంలోకి వెళ్ళిందనే చర్చ ఈ సమావేశంలో జరిగినట్లు రేవంత్ తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ గురించి చర్చించామన్నారు. భవిష్యత్తు యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుంటామన్నారు.
కేసీఆర్‌ను గద్దె దించడానికి అవసరమైన ఎన్నికల యాక్షన్ ప్లాన్ ఈ సమావేశంతోనే మొదలైందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములా గురించి ఖర్గే, థాక్రే తదితరులు ఈ సమావేశంలో తమకు వివరించారని, వారి అనుభవాలను పంచారని తెలిపారు. అదే తరహాలో పదునైన కార్యాచరణతో తెలంగాణలో అధికారంలోకి రావడానికి సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక ఖరారైందన్నారు.
Read More..