ఐదు రాష్ట్రాల్లోనూ కర్ణాటక రిజల్ట్ రిపీట్: సచిన్ పైలెట్

by Satheesh |
ఐదు రాష్ట్రాల్లోనూ కర్ణాటక రిజల్ట్ రిపీట్: సచిన్ పైలెట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మార్పు కోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజల్లో మంచి స్పందన ఉన్నదన్నారు. ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పవర్‌లోకి వస్తుందన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపించాలన్నారు. భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారన్నారు. ఇది పార్టీ మైలేజ్‌ను అమాంతంగా పెంచిందన్నారు. 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓటేయాలన్నారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed