- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కారు’కు కర్ణాటక ఫియర్.. అక్కడ గెలిచే పార్టీపై నజర్!
అక్కడి ఫలితాల తర్వాత..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అందుకే అక్కడి ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు ఉంటాయని టాక్. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ పార్టీతో అసలైన పోటీ ఉంటుందనే విషయంపై క్లారిటీ వస్తుందని బీఆర్ఎస్ లీడర్లు అంచనా వేస్తున్నారు.
అక్కడ కాంగ్రెస్ గానీ, లేక బీజేపీ గానీ మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారం చేపడితే అక్కడ గెలిచిన పార్టీ అదే ఊపుతో తెలంగాణలోనూ దూకుడుగా వ్యవహరించే చాన్స్ ఉన్నది. అందుకే కాంగ్రెస్, బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకుండా ఉండేందుకు జేడీఎస్‌కు మద్దతుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న గులాబీ అధినేత అందుకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఆ రెండు పార్టీలే టార్గెట్‌గా..
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి, ఎలాగైన అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం చాలా కాలంగా వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఓ వైపు తమను నేరుగా ఢీకొట్టే శక్తి ఆ రెండు పార్టీలకు లేదని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నా.. మరో వైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై పడటం ఖాయమన్న గుబులు పట్టుకుంది.
అందులో ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ కర్ణాటకలో గెలిచినా ఇక్కడ వాటిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తెలంగాణలో దానినిపై విమర్శలు గుప్పించి కార్నర్ చేసేందుకు ప్లాన్ ఏ, ఒక వేళ బీజేపీ విజయం సాధిస్తే ఆ ప్రభావం ఇక్కడ పడకుండా ఆ పార్టీని ఎదుర్కొనేందుకు ప్లాన్ బీ రెడీ చేస్తున్నట్టు ఆ పార్టీ లీడర్ల ద్వారా తెలిసింది.
కర్ణాటకలో హంగ్ రావాలని ఆకాంక్ష
కర్ణాటకలో హంగ్ వచ్చే తెలంగాణలో బీఆర్ఎస్‌కు లాభం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. హంగ్ ఏర్పడితే బీజేపీకి, కాంగ్రెస్ నేరుగా తెలంగానలో ప్రభావం చూపలేవని అంచనా వేస్తున్నారు. అందుకే జేడీఎస్ కు మద్దతుగా బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమైందని సమాచారం. హంగ్ వస్తే అక్కడ కుమారస్వామితో కింగ్ మేకర్ అవుతామని కేసీఆర్ భావిస్తున్నట్టు టాక్.