తెలంగాణకు కర్ణాటక ఏనుగు ‘రూపావతి’

by Rajesh |
తెలంగాణకు కర్ణాటక ఏనుగు ‘రూపావతి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : బోనాలు, మొహర్రం ఊరేగింపు కోసం కర్నాటక నుంచి తీసుకువచ్చిన రూపావతి ఏనుగు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలంగాణ అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నిజాం రిలీజియన్ ట్రస్ట్, అక్కన్న మాదన్న దేవాలయం సభ్యులు మొహర్రం, బోనాల లో ఏనుగు ఊరేగింపు కోసం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారని, అందులో భాగంగా కర్ణాటకలోని దావణగెరెలోని జగద్గురు పంచాచార్య మందిర్ ట్రస్ట్ నుంచి రూపావతి ఏనుగును తీసుకురావడానికి తెలంగాణ అటవీ శాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే, రూపవతి ఏనుగును తీసుకువచ్చినట్లు చెప్పారు. కర్ణాటక నుంచి హైద్రాబాద్ కు తీసుకొచ్చే క్రమంలో మొఖా అనే ప్రదేశంలో వెటర్నరీ వైద్య బృందం వైద్య పరీక్షలు కూడా నిర్వహించిందన్నారు. హైద్రాబాద్ చేరుకున్న తర్వాత జూపార్క్, పశుసంవర్ధక శాఖ డాక్టర్లు మరోసారి టెస్టులు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed