వామ్మో ఇవి సీసీ రోడ్లేనా..! నరకప్రాయంగా కోరుట్ల రహదారులు

by Shiva |   ( Updated:2024-07-09 09:10:38.0  )
వామ్మో ఇవి సీసీ రోడ్లేనా..! నరకప్రాయంగా కోరుట్ల రహదారులు
X

దిశ, కోరుట్ల రూరల్: కోరుట్ల పట్టణంలో నాసిరకం రహదారులు నరకప్రాయంగా మారాయి. చినుకు పడిందే తడవు చిత్తడిగా మారి చుక్కలు చూపిస్తున్నాయి. పట్టణంలో పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం నాసిరకంగా ఉన్న క్రమంలో వానాకాలంతో వాటి అసలు రంగు బయటపడుతోంది. పడిన వర్షపు నీరంతా రహదారిపై నిలిచిపోయి ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. మరికొన్న చోట్ల మట్టిరోడ్ల కంటే అధ్వానంగా మారి అడుగు తీసి అడుగు వేయలేని చందంగా మారాయి. దీంతో వాహనదారులు ఈ మార్గాల్లో ప్రయాణించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వానాకాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మరో మూన్నెళ్ల సంగతి ఏమిటని కాలనీ వాసులు వాపోతున్నారు. కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్ నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వరకు వేసిన సీసీ రోడ్డు అధ్వానమైన రహదారులకు నిదర్శనంగా నిలుస్తోంది. పలుచోట్ల ఈ రహదారి వర్షపు నీరు నిలిచి చెరువులా మారగా, మరికొన్ని చోట్ల మట్టిరోడ్డు బురద మయంగా మారింది. అడుగులోతు బురద పేరుకుపోయి అధ్వానంగా ఉంది. దీంతో వందలాది కుటుంబాలు నివసిస్తున్న ఈ వీధి నివాసితులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. బల్దియా అధికారులు, పాలకవర్గం అంతర్గత రహదారులపై దృష్టి సారించి వానాకాలంలో ఈ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed