రుద్రంగిలో ఘనంగా ప్రపంచ టైలర్స్ డే వేడుకలు

by S Gopi |
రుద్రంగిలో ఘనంగా ప్రపంచ టైలర్స్ డే వేడుకలు
X

దిశ, రుద్రంగి: ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 28న ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ట్రైలర్స్ డే ను జరుపుకుంటారని, మహిళలమైన మనం టైలరింగ్ చేస్తూ సమాజంలో ఆత్మ గౌరవంతో మన కాళ్లపై మనం నిలబడాలన్నారు. కుటుంబ పోషణలో మనవంతుగా చేయూతనందిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న టైలరింగ్ చేసే మహిళలకు వృత్తి పరంగా మరింత అభివృద్ధి చెందేవిదంగా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బసని లావణ్య, తుమ్మనపెల్లి శోభ, పిల్లమారపు భాస్కర్, బత్తుల లక్ష్మీ, పడల లత, గసికంటి ప్రేమలతోపాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Next Story