- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగిత్యాల అభివృద్ధికి కృషి
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల పట్టణం నలువైపులా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తా అని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 32వ వార్డులో రూ.పది లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 32వ వార్డులో 40 లక్షల పనులు ఇంకా మిగిలి ఉన్నాయన్నారు. ,ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పట్టణంలో కాంట్రాక్టర్లకు రూ.5 కోట్ల బకాయిలు చెల్లించినట్టు చెప్పారు.
జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులకి కోట్లలో నిధులు ఖర్చు చేశామన్నారు. కండ్ల పల్లి, ముప్పాళ్ల చెరువులో చేపలు వదిలినట్టు తెలిపారు. రైతుబంధు కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. జగిత్యాల పట్టణం నలువైపులా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చిరంజీవి, ఏఈ అనిల్, కౌన్సిలర్ లు కుసరి అనిల్, పిట్ట ధర్మరాజు, పంబాల రాంకుమార్, జుంభర్తీ రాజ్ కుమార్, కూతురు రాజేష్, నాయకులు కొలగని సత్యం, కూతురు శేఖర్, గట్టు రాజు, ప్రభాత్ సింగ్ ఠాకూర్, శ్రీరామ్ భిక్షపతి, పవన్ గౌడ్, చిట్ల మనోహర్, ఏనుగుల రాజు తదితరులు పాల్గొన్నారు.