- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమి అమ్మిస్తవా.. పైసలిస్తవా..!
తన చావుకు ఇంటలిజెన్స్ సీఐ కారణమంటూ మృతుడి సూసైడ్ నోట్
దిశ, కరీంనగర్ బ్యూరో: పోలీసు శాఖలో ఇంటలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న సీఐ స్థాయి అధికారి వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చోటుచేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన కథనం ప్రకారం.. పోలీస్ శాఖలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న సీఐ గోపాలకృష్ణ గోపాల్పూర్ శివారులో బోడిగే శ్యాం అలియస్ శంభయ్య అనే వ్యక్తి వద్ద భూమి కొనుగోలు చేశాడు.
కొనుగోలు సమయంలో ఆ భూమిపై పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు వస్తుందని శ్యాం తెలపడంతో సదరు సీఐ భూమి కొనుగోలు చేశాడు. నిర్ణీత సమయంలో తిరిగి భూమి అమ్ముడు పోకపోవడంతో సీఐ తనకు చెప్పిన ప్రకారం భూమి విక్రయించి డబ్బు చెల్లించాలని హుకుం జారీ చేశాడని మృతుని భార్య తెలిపింది. భూమి కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సీఐ తన భర్తతో పాటు తనను పిలిపించుకొని భూమి విక్రయించిన, విక్రయించకపోయినా తనకు డబ్బు చెల్లించాలని అగ్రిమెంట్ రాయించుకున్నాడని బాధితుడి భార్య తెలిపింది.
అగ్రిమెంట్ రాసిచ్చిన సమయానికి భూమి అమ్ముడు పోకపోవడంతో తన భర్తపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య తెలిపింది. సీఐ గోపీ కృష్ణ తనను బెదిరించాడంటూ మృతుడు శంభయ్య అలియస్ శ్యాం సుసైడ్నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అసభ్య పదజాలంతో తిట్టడంతో తాను మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.